Sunday, November 11, 2007

టీ.వీ వాళ్ళ మీద కోపమొచ్చింది...

ఈ టి.వి. వాళ్ళ పోటీ కాదుకానీ - బుఱ్ఱ చెడగొట్టేస్తున్నారు.
ఈ ఆదివారం చూడండి ఒకే సమయానికి ఎన్ని మంచి సినిమాలెసారో !

ఈ టీ.వీ.- క్షణ క్షణం
మా టీ.వీ.- అంతం
తేజ టీ.వీ.- నిజం
జెమిని - రక్షణ

ఇవి సరిపోనట్టు - అక్కడ డీ.డీ.లో ఇండియా పాక్ ODI...

ఉంటే అన్నీ ఇలా - లేక పోతే అంతా చెత్త! ఈ ప్రొగ్రాం కంపైలర్స్ ఎవరో కాని - ఉత్త పనికిమాలిన చెత్త వెధవలు!

మర్చే పోయా - ఒట్టి తెలుగు ఛానళ్ళని మాత్రమే ఎందుకు -
జీ స్టూడియొ - Honey, I shrunk the kids
స్టార్ మూవీస్ - Die Hard
H.B.O - Click

Thursday, October 11, 2007

సూర్యుడు - III - అయస్కాంత క్షేత్రాలు


మన సూర్యుడు కుడా మన భూమి లాగే ఒక పెద్ద అయస్కాంతం. మరి అంత పెద్ద అయస్కాంతానికి ఎంత పెద్ద క్షేత్రముంటుందో ఊహించండి!
(అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రముంటుంది - అంటే ఆ ప్రదేశములో ఆ అయస్కాంతము యొక్క ఆకర్షణ లేదా వికర్షణా శక్తి ప్రభావం తెలుస్తుందన్నమాట).
సూర్యుని అయస్కాంత క్షేత్రం ప్లూటోని దాటి ఉంటుంది.

ఇందులో ఇంకొక విషయమేమిటంటే - మరి అంత పెద్ద అయస్కాంతం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే దాని క్షేత్రం ఎలా ఉంటుంది? అయస్కాంతాలు కదిలితే అవి కరెంటుని కుడా ఉత్పత్తి చేస్తాయిగా - ఈ electro magnetic క్షేత్రం ఎలా ఉంటుంది...
ఈ పటం చూడండి - మీకే తెలుస్తుంది...

మరి భూమి కుడా అయస్కాంతమే కదా - మరి ఈ రెండు అయస్కాంత క్షేత్రాల వల్ల ఏం జరుగుతుంది?
భూమి యొక్క అయస్కాంతక్షేత్రాన్ని సూర్యుని క్షేత్రం compress చేస్తుంది. అలా చేయడంవల్ల భూఅయస్కాంత క్షేత్రం సూర్యుడికి వ్యతిరేక దిశలో ఒక తోకలా ఏర్పడుతుంది - ఈ తోక కుడా ప్లూటోని దాటుకొని వ్యాపిస్తుంది.
సూర్యునినించి వచ్చే అయానులు కొన్ని ఈ తోకలో చిక్కుకొని - ఎప్పట్టికీ అందులొనే తిరుగుతుంటాయి.
అలాగే సూర్యుని నించి వచ్చే అయానులు మన భూమి atmosphereని తాకినప్పుడు - కాంతిని విడుదల చేస్తాయి -- ఇవి మనకి ఉత్తర, దక్షిన ధ్రువాల దగ్గర బాగా కనిపిస్తాయి - ఇవేమిటో తెలుసా? ...
Northern and Sourthern Lights.
తెలుగు కాక ఆంగ్ల పదాలు వాడానంటే - అప్పుడక్కడ దానికి తెలుగు పదం తట్టలేదన్న మాట! - ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి.

త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్...

ఇసాక్ ఆసిమొవ్ అనే ఒక శాస్త్రవేత్త, సైన్స్ ఫిక్షన్ కధలు చాలా వ్రాసారు. ఆయన రోబోట్లను గురించి చాలా కధలు వ్రాసారు, ఆయన చాలా కధలలో రోబోట్లు ప్రధాన పాత్రధారులు. మరి ఈ రోబోట్లను నియంత్రించే నియమాలు కుడా ఆయన సూత్రికరించారు. వీటినే "త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్" అని అంటారు - ఆ మూడు సూత్రాలేమిటంటే -

1. ఓ రోబోట్ తన చర్యలవల్ల కాని, లేక చర్య తీసుకోక పోవటంవల్ల కాని మానవునికి హాని చేయరాదు.

2. ఓ రోబోట్ సదా మానవుని ఆజ్ఞలనను పాటించాలి, ఆ ఆజ్ఞలు మొదటి సూత్రానికి వ్యతిరేకం కానంత వరకు.

3. ఓ రోబోట్ తనని తాను కాపాడుకోవాలి, మొదటి రెండు సూత్రాలను ధిక్కరించనంతవరకూ.


ఈ సూత్రాలనాయన ఎందుకు ప్రతిపాదించారంటే, మానవులకి యంత్రాలంటే కొంచం భయం. అందులోనూ, తమంతట తాము ఆలోచించి, నిర్ణయాలు తీసుకొని పని చేయగలిగే యంత్రాలంటే మరీను. ఈ భయాన్ని లాభం క్రింద మార్చుకొన్న సినిమాలు చాలా ఉన్నాయి. మేరీ షెల్లి వ్రాసిన ఫ్రాంకెన్-స్టైన్ అనే నవల ఇలాంటిదే, టేర్మినేటర్ సినిమాలు అలాంటివే. అందులో ఈ intelligent యంత్రాలు యుధ్దాలకి, భయాందోళనలు కలిగించడానికి తప్ప దేనికి వాడరు. కాని ఇసాక్ ఆసిమోవ్ రోబోట్లు, మన దైనందిన జీవితంలో భాగంగా కనిపిస్తాయి. అలా కనిపింపచేయడం కోసమే - ఈ మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ఆయన వ్రాసిన మొదటి కధలలో - ఈ రోబోట్లు ఎవరికీ హాని చేయవు అని చూపించే కధలే. (అలా అని తర్వాతి కధల్లో హాని చెస్తాయని కాదు). రోబోటిక్స్ అనే పదాన్ని మొదటి సారిగా వాడింది ఈయనే.

Lateral Thinking...

Recently I saw a post on "Thinking-out-of-the-box" and "Lateral thinking", thought I'd add to the fun with a few questions...




Reader warning: you may have read these questions earlier in some form or other...


Example:

man
--------------
board


Ans: Man Overboard


1. r
road
a
d



2. /r/e/a/d/


3. zero
----------
M.A.
B.A.


4. knee
-----------
light

5. he / himself


6. ecnalg


7. abaaaaaaaaaaaaaaaabbbbbbbbbbbbbbbbbbaaaaaaaabbbbbbbbbbb


8. death ...... ......... ........ life


9. ------supply----supply------supply------supply------


And the last one....

T H I N K T H I N K



Have fun....

సూర్యుడు - II - భూమి, పాలపుంత

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందని మనం స్కూల్లో చదివాము. దాని గురించి కొన్ని వి-శేషాలు:
భూమి తన చుట్టూ తాను - 460 మైళ్ళ ప్రతి సెకను వేగంతో తిరుగుతొంది. అంటే, భూమధ్య రేఖ మీద మీరు గనక నించొని ఉంటే - మీరు గంటకి ఇరవై ఏడు వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నారన్న మాట. ఏంటో కార్లో గంటకి ఎనభై మైళ్ళ వేగంతో వెళ్ళి సంతోషించేస్తాము!
మీరు తిరుగుతున్నారు అనే కంటే - భూమి మిమ్మల్ని తిప్పుతొందన్న మాట సరైనదేమో. (మనకన్నా చంద్రుడు చిన్న వాడైనా - చంద్రుని ఆకర్షణ శక్తివల్ల భూమి తిరిగే వేగం వంద సంవత్సరాలకి 2 ఎం.ఎం. చొప్పున తగ్గిపోతొంది.)

మరి ఇదొకటే కాదు - సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాముగా - మనల్ని భూమి సూర్యుడి చుట్టూ గంటకి నలభై వేల కి.మి. వేగంతో తీసుకొని వెళ్తోంది. ఇవన్ని మనం స్కూల్లో తెలుసుకొనే ఉంటాము.

సూర్యుడు కుడా తనచుట్టూ తాను తిరుగుతాడు - మధ్య రేఖ వద్ద తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై ఏడు రోజులు తీసుకొంటాడు. [The sun is so big that it takes from 25-32 days / equator to poles] అంటే సూర్యుని భూమధ్య రేఖ మీద గనక మీరు నుంచొంటే (నుంచోగలిగితే అనాలేమో) - మీరు గంటకి నాలుగు వేల ఐదు వందల మైళ్ళ వేగంతో తిరుగుతున్నారనమాట.

ఇవేవి కాకుండా - సూర్యుడు మన గెలాక్సి చుట్టూ కుడా తిరుగుతాడు. సెకనుకి రెండు వందల కి.మి పైగా వేగంతో సూర్యుడు మనని గెలాక్సి చుట్టూ తిప్పుతున్నాడు.

కొంచం అలా పక్కకి వెళ్దాం - కొంచం సేపే - మళ్ళి వెనక్కొచేద్దాం లేండి -
పార్-సెక్ అని దూరాన్ని సూచించే కొలత ఒకటుంది. ఒక పార్-సెక్ అంటే 3.262 కాంతి సంవత్సరాలు.
అవునండోయి - కాంతి సంవత్సరము అంటే 1 సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం అన్న మాట: సూర్యుడి నించి కాంతి మన దగ్గరకి రావడానికి ఎనిమిది నిమిషాల ముఫ్పైఒక్క సెకనులు పడుతుంది, మీరే ఊహించండి - ఒక సంవత్సరంలో ఎంత దూరం వెళ్తుందో.

మన సూర్యుడు మన గెలాక్సి మధ్యనించి ఎనిమిది వేల పార్-సెక్_ల దూరంలొ ఉన్నాడు.
Voyager అనే అంతరిక్ష నౌక మన భూమికి 0.00046 పార్-సెక్_ల దూరం వెళ్ళడానికి ఇరవైఏడు సంవత్సరాలు తీసుకొంది. (ఎక్కడికి వెళ్ళిందనుకొన్నారు - ప్లూటో దాటిందంతే!).
మనం మన గెలాక్సి మధ్యకి వెళ్ళడానికి ప్రయాణమైతే ఎంత సమయం తీసుకొంటామో మీరే లెఖ్ఖ వెయ్యండి.
ఇంకొక విషయం చూసి - మళ్ళీ మనం మన వేగాల్లోకి వచ్చేద్దాము. మన సూర్యుడు నాలుగువేల ఏడువందల మిలియన్ సంవత్సరాల వయస్సున్నవాడు. ఇంకా, ఐదువేల మిలియన్ సంవత్సరాల వయస్సు మిగిలి ఉంది. అంతే సూర్యుడి ఆయుషు 100 అనుకొంటే - ఇప్పుడు సూర్యుడి వయస్సు 47 అన్నమాట.
ఈ నాలుగువేల చిల్లర మిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడు మన గెలాక్సి చుట్టూ ఎన్ని సార్లు తిరిగాడో ఊహించండి - మహా అంటే ఇరవై సార్లు! చూసారా... ఎంతెంత దూరాలో!




మనమూ తిరిగి - సూర్యుడూ తిరిగి - మరి మన గెలాక్సి తిరగకుండా ఉంటుందా! మన గెలాక్సి హైడ్రా అనే గెలాక్సి వైపుకి ఎంత మెల్లగా ప్రయణిస్తోందంటే - ఒక్క రోజులో అది భూమిని యాభై మిలియన్ కి.మి. దూరం లాక్కెళుతొంది - అంటే ప్లూటో కనక కదలకుండా ఉంటే - మనం దానిని మూడు నెలల కంటే తక్కువ సమయంలో చేరుకొంటామన మాట...
Voyager 1కి ఏంత సమయం పట్టిందో గుర్తుందిగా...
just 27 years!!!


గమనిక - మన భూమి కదలకుండా ఉంటే - సూర్యుడు మన దగ్గరికి ఎనిమిది రోజుల్లో చేరి పొతాడు.

Tuesday, October 9, 2007

సూర్యుడు - I

పైన ఉన్న సూర్యుడి బొమ్మలో top rightలొ పొగ చిమ్ముతున్నట్టు ఉంది చూసారా! అది చాలా ఎక్కువ ఉష్ణొగ్రతలో ఉన్న వాయువు మరియు plasma. plasma అంటే -ఒట్టి అయానులు మాత్రమే ఉన్నాయన మాట. అది సూర్యుని మీద ఒక విస్ఫొటం - వీటినే సొలార్ ఫ్లేర్ అంటారు. ఇది దాని చుట్టూ ఉన్న plasma, అయాన్లను దగ్గర దగ్గర కాంతి వేగానికి తీసుకెళ్తుంది. కొన్ని మిలియన్ Kకి ఉష్ణోగ్రతని పెంచుతుంది.
ఇవి కాకుండా సొలార్ విండ్స్ కుడా ఉంటాయి. ఇవి ఏడువందలయాభై కి.మి. ప్రతి సెకను (అత్యధిక) వేగంతో ప్రయాణిస్తాయి. (మానవ శరీరము లోని టైప్ "ఏ" నరాలు సమాచారాన్ని మూడువందల యాభై మీటర్ ప్రతి సెకను వేగంతో పంపగలవు.)
పైన బొమ్మలో ఉన్నది సూర్యునితో పోలిస్తే చిన్నదిగానే ఉన్నా... దాని (Solarflare) పొడవు 250,000 కి. మి - అంటే దాదాపు మనకి చంద్రుడికి ఉన్నంత దూరం!
సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 5,800K మాత్రమే. [K అంటే Kelvin; 0K = -273C]
కానీ, సూర్యుని అఁతర్భాగంలో nuclear fusion (దీనికి తెలుగు మర్చిపొయా! - నేను తెలుగు మీడియం కాదు... మరి మీకెవరికైనా తెలిస్తే చెప్పండి) జరుగుతూ ఉంటుంది.
ఈ reaction ప్రతి సెకనుకి ఏడువందల మిలియన్ టన్నుల hydrogen వాడుతుంది!
దీనికి పర్యవసానంగా ఆరువందల తొంభై ఐదు మిలియన్ టన్నుల helium ఉత్పత్తి అవుతుంది.
మిగిలిన ఐదు మిలియన్ టన్నులూ శక్తిగా (గామా కిరణాలు) మారుతుంది.
అంటే సూర్యుని అంతర్భాగంలో జనించే శక్తి - మూడువందల ఎనభై ఆరు బిలియన్ బిలియన్ మెగా వాట్లు. అంటే 386 ప్రక్కన ముప్ఫై సున్నాలు. లెక్కలు మీరే చేసుకోండి!
మరి ఇంత శక్తి ఉత్పత్తి ఐతే అక్కడ (సూర్యాఁతర్భాగంలో) ఉష్ణోగ్రత ఎంతో తెలుసా - 15.6 మిలియన్ K.
మరి ఉపరితల ఉష్ణోగ్రతేమిటి అంత తక్కువ ఉందీ అనుకొంటున్నారా - మరి ఎందుకుండదు - సూర్యుని ఉపరితలం చేరడానికి ఇది ఆరు లక్షల తొంభై ఐదు వేల కి.మి ప్రయాణించాలి. (ఇదొకటే కాదు ఇంకా చాలా వాటికి ఈ శక్తి ఉపయోగ పడుతుంది). [అంటే సూర్యుని diameter 1.39 మిలియన్ కి.మి.]
అదే భూమి అంతర్భాగం నించి ఉపరితలానికి రావడానికి ఆరు వేల మూడువందల డభ్బై ఎనిమిది కి. మి. ప్రయాణిస్తే చాలు.

మనమూ - మన ప్రపంచం - మన విశ్వం

మనము, మన ప్రపంచం, మన గొడవలు, మన కష్ఠాలు, మన ప్రపంచానికి మనమే రాజులఁమా !- అంతేనేమో...

మన భూమే పెద్దది asteroid beltలో ఉన్నవాటిలో (పాపం ప్లుటోని క్షమించేద్దాం)...

మిగిలిన వాటిని కుడా చుద్దాం...


ఇదేంటి! మనమింతైపొయాం! హా!...

మరి సురీడు ఏమంటాడో...


భూమి కనిపించిందా?... మనమింకా మన సూరీడ్నించి దూరం వెళ్ళలే...

సరి... మన సూరీడు గొప్ప! చాలా పెద్దది...

నిజమా...


ఇంకొంచం అలా వెళ్దామా...

అయ్యో! ఇదేంటి... ఇలా ఐపోయింది...
సూరీడు మరీ గోళిలా ఉన్నాడు...


మన భూమి ఏదీ!! వెదకండీ...



ఐపొయిందా!! లేదు.. మన విశ్వమింకా ఏదో చెప్తానంటొంది....


Antares మనకు ఇప్పటికి తెలిసిన విశ్వంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో పదిహేనవది...

మనకు వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది...

ఇందులో మన సూరీడు ఒక pixel అంత ఉన్నాడు...



ఇంక చెప్పడానికి ఏముంది!

Monday, October 8, 2007

భారతంలో ఈ-మైల్ లాంటి టెక్నాలజి ఉంటే ఎలా ఉంటుంది - చిన్న ట్రై...

Spy (searching for the pandavas - in their 13th year - agnathavaas) to Dhuryodhana:

From: spy_1 spy_1@searchforpandavas.raw.hastina.bharat
To: Dhuryodhana.TheGreat dhur.TheGreat@royalpalace.hastina.bharat
Sent: almost end of dwapara
Sub: Progress in search for Pandavas

Hail to the Great, the one and only True Ruler of Hastina,

Sir, I have hacked into the Pandava_Yadava secure network servers, and have intercepted a mail from a valala@kitchens.viratapalace to TheDeciever@screwkauravas.yadavapalace.

The message was in 256 bit cypher, which we broke using the key "Pandavas in Aganatavas" using 8-bit block cyclic conversion techniques. *hoping to get his share of hard work recognized and rewards....*.

The message text is reproduced here for your perusal:

Dear Bro-in-law, By your advice, I've disposed of keechaka - using krishna as bait. [for those who are uninitiated - draupadi's actual name is krishna]. Hope we can keep this info confidential - till it's time to announce to the world of our true identities.

Hail the Great King to be,
With respects and due regards
-Spy_1

**************

From: Dhuryodhana.TheGreat dhur.TheGreat@royalpalace.hastina.bharat
To: DhustaChatustayam dusta.chatustayam@plotters.pandavadownfall.royalpalace
Sent: almost end of dwapara
Sub: meet after lunch

I've attached a mail from our spy searching for pandavas, looks like we atlast may have a lead.

Emergency meeting - War room - after lunch.
Be there - we need to discuss our action plan.

Matter is highly confidential - hence mailing you personally [Think, my secy is a spy for Bhisma - good help is scarce these days, need to talk to HR on this].

-Dhur

************************

War room --- Dhuryodhana, Dussaasana, Sakuni and Karna - meeting in progress

********

Dhur: Do we have the satellite pics of the virata kitchens yet?
Dus : our MI (military intelligence) is working on it Bro.
Dhur: What do you make of the decoded message Mama?
Saks: My 2 cents nephew? - Only Bheema is capable of killing keechaka. This Valala appears to be either bheema or someone working for him. What with all these secure server sites coming up all over the place, it's becoming difficult to track. We should plan an attack on Virata, flush out if pandavas are hiding there.
Kar:
Dhur: okay - send out the minutes of the meeting, we will need to get bhisma and others also involved.

***********************

From: Dussasana dussasana.grabAsaree@royalpalace.hastina.bharat
To: Army heads KauravaArmyHeads@hastina.bharat
CC: Bheesma TheGrandOldMan@pandavapakshapaati.royalpalace.hastina.bharat
Sent: almost end of dwapara
Sub: Operation - "Uttara Go Grahana"

All,
Operation "Uttara Go Grahana" has been planned and initiated.
The mail hall is the designated Ops Center.
Get your batallions ready and report to the Ops Center by O' seventeen hundred hours.

-Dus

***********

Rest of the story - I hope you guys know how it went.

Thursday, October 4, 2007

విశ్వం - నక్షత్రాలు

నక్షత్రాలు, తారలు, గ్రహాలు, మన విశ్వం అంటే ఆసక్తి ఉంటే - ఇవి చూడండి - http://www.msnbc.msn.com/id/6955261/?GT1=10450

Wednesday, September 19, 2007

ఇక్కట్ట్లు - II

మాట ఇచ్చేసాను... ఒప్పుకున్నాక తప్పదు, అది ఏమైనా కానివ్వండి. మా ఆఫిసులో ఒక కుర్రాడు trainee కింద చేరాడు. ఆ అబ్బాయి ఓసారి మాటల్లొ అదివరకు web site designing చేసాను అని చెప్పినట్ట్లు గుర్తు. ఇంకేం వెన్వెంటనే ఆఘమేఘాల మీద ఆ అబ్బాయిని పట్టుకొని - బాబు, నీకు ఏదొ వెబ్ సైట్లు చెయ్యడంలొ బోలెడు పరిచయం ఉన్నదట కదా! కాస్త ఈ పని చేసిపెట్టు - అని అడిగా. అలాగే అని అంటున్నప్పుడు ఆ అబ్బాయిని చూసి ఏందుకో అడగాలనిపించి - ఉండబట్టలేక - అడిగేసా: నాయనా, చిట్టి తండ్రి, ఇంతకు ముందు ఏమేమి చేసావు -
(ఈ మాణిక్యం తండ్రిగారేమో - నా పుత్రరత్నం internet, web, designing, development అంటూ నాకర్దంకాని ముక్కలేవో చెప్పి ఇప్పటికి చాలా తగలేసాడు, కాస్త మీ ఆఫిసులో పెట్టుకొని కాస్తొ కూస్తొ పని నేర్పించండి అని అడిగారు. ఆయనగారికి కుడా రత్నాలంటే నమ్మకముంది, కానీ డబ్బులు తగలేస్తున్నాడని బాధ).

అప్పుడసలు విషయం బయటపడ్డది - మణులు, మాణిక్యాలు కుడ రాళ్ళేనని. సరే, ఇప్పుడింక చేసేదేముంటుంది - అబ్బాయిగార్ని గూగ్లమని (అంటే - googleలొ వెదకమని), నేనున్ను కాస్త గూగ్లి - మొత్తానికో వారంతర్వాత ఓ వెబ్ సైట్ తయరు చేయ్యించా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, web site designing అంటే - ఆ అబ్బాయి భాషలొ graphics చేయడమట - బొమ్మలు మాత్రం బానే చేసాడు. ఒ సైట్లు హొస్టింగ్ చేసెవాడిని పట్టుకొని మొత్తానికి ఆ వెబ్ సైట్ హొస్ట్ చేయించా. అప్పుడు మొదలయ్యాయి ఇక్కట్లు...

మన కధలో ముఖ్య పాత్రధారైన మన ప్రియతమ మెజర్-జనరల్ గారు - వారు స్వయంగా, మరి వారి శిష్యపరమాణువైనటువంటి మా మిత్రుఁలుగారి ద్వారా, గంట లేక అరగంటకొక ఫొను చొప్పున - ఈ రాత్రి నిద్రపోయె ముందొకటి, రేపు నిద్ర లేస్తే ఇంకొకటి, ఆకలేస్తే ఎఱ్ఱది వెయ్యకపోతే పచ్చది అను చందాన - పైన రంగు బావుంది, కాని ఈ font రంగు ఇంకొంచం lightగా ఉంటే బావుంటుంది, మీరు పెట్టిన వినాయకుడి ఫోటో బావుంది - ఇంకొక వినాయకుడి ఫోటో ఉన్నదా?, ఇక్కడ ఈ రంగు కొంచం తెలికైంది, ఇలా అలా అంటూ.... ఒక్క రెండు వారాలు మాత్రమే మా జీవితాల్ని కొంచం కకలావికలం చేసారు. ఇంతా చేస్తే - అంతా బావుంది అనుకొనే సమయానికి - ఆయనగారికి మా మీద కోపమొచ్చింది - ఎందుకోననుకునేరు --- మేము పెళ్ళి కొడుకు/కూతురి వివరాలు నింపే పేజీలొ ఒక చిన్న తప్పు చేసాము...

******** తల్లి పేరు నింపడానికి ఉన్న field తండ్రి పేరు నింపడానికిచ్చినదానికంటే పెద్దదిగా ఉన్నది *******

Monday, September 17, 2007

ఇక్కట్ట్లు - I

కొన్నాళ్ళ క్రితం నేనొక మేజర్-జనరల్ని కలిసాను. ఆయన నేను softwareలొ ఉన్నానని తెలుసుకొని నన్నొక website చేసి పెట్టమని అడిగారు. వెబ్ సైట్ చేసి పెట్టమనడం బానే ఉంది - కాని అక్కడే ఒక చిన్న చిక్కొచ్చి పడ్డది - నేనింతవరకు ఒక్క web site కుడా చెయ్యలేదు. అసలా వైపుకే చూడలేదు. ఇటు చూస్తే ఈ మేజర్-జనరల్ గారెమొ - అబ్బాయి - నీకేమొ computersలొ అన్ని విశేషాలు తెలుసు కదా ఏది ఈ చిన్న పని చేసిపెట్టు అని... (వెధవది నోరు ఊరుకోదు కదా - ఏమి చేస్తుంటావబ్బాయి అని అడిగితే - ఓ ఇదిని లేదు, అదని లేదు computerలు, softwareలొ విరగ తీసేస్తుంటా అని బడాయికిపోయా - అంతే ఇరుక్కుపోయా; ఊరికే అన్నారా - నోరా వీపుకి తేకే అని!) - సరే ఏమి చేస్తాం!! అలాగేనండి చేస్తాను అనక తప్పింది కాదు.

ఇహ్హ చూడండి నా పాట్లు!!! అసలే చఛ్చేంత పని ఆఫిసులొ... దొరికేదే ఏదో ఒక శనివారమొ లేక ఆదివారమొ అందులొ ఎన్ని పనులు - ఆ రెండు రోజులే చాకలివాడి దగ్గర్నించి ఎలక్రీషియను, పంపులు బాగు చేసేవాడు, కిరాణా వాడు - వాడూ వీడని లేదు అందరూనూ - ఈ రెండు రోజుల్లోనే దిగుతారు. దాని మీద ఈ మేజర్-జనరల్ గారి ఫోన్లు! అబ్బాయ్ "రేపటికల్లా చేసేస్తావా!" అని.

చెయ్యడం పెద్ద సమస్య కాదు, చెయ్యడానికి సమయం దొరికించుకోవడం పెద్ద సమస్య అయ్యింది. ఎలా చెప్పేది ఆయనగారికి - ఊపిరి తీసుకోలేనంత పని నాయనా - ఏవరికైనా ఓ వెయ్యో వందో ఇచ్చి చేయించుకోవచ్చుకదా అని - దానికి తోడు ఏ స్నేహితుడివల్ల ఈ మేజర్-జనరల్ గారి పరిచయం అయ్యిందో - ఆయన శిష్యపరమాణువీమా మిత్రులుఁగారు!! ఆ! మా గురువుగారు కోరక కోరక నిన్ను చూడగానే ఎందుకనో ఓ కోరిక కోరారు - నువ్వేంటి! ఇలాంటి సలహాలు అంటూ నాకు వాయింపు! దానికి తోడు, అదేమైనా మాములు వెబ్ సైటా - matrimonials! - పెళ్ళి ప్రకటనల సైటు!

సశేషం

Sunday, September 16, 2007

బారసాల


ఇది నా మొదటి బ్లాగు - తెలుగులొ. అంటే ఇంతకు ముందు నేను బ్లాగులు వ్రాసాను కానీ, అన్ని ఆంగ్లం లొనే వ్రాసాను. కాగితం మీద వ్రాయదం ఏంత సులభమొ, ఈ కంప్యుటెర్ కీప్యాడుతొ టైపు చెయడం కొంచం కష్ఠమే.లేఖిని చాలా బావుంది మరియు టైపు చెయడం సులభంగానె ఉంది, కొంత ప్రాక్టీసు కావాలనుకొండి. రొజువారి కార్యక్రమాల్లొ ఆంగ్లం (ఇంగ్లీష్ అని వ్రాయడం కొంచం కష్ఠమే లేఖినిలొ) ఏంతగా వాడుతున్నామంటే చాలా పదాలు తెలుగులొకి తర్జమా చెసుకొని వ్రాయవలసి వస్తొంది. నాకు ఇంకా ప్రాక్టీసుకి తెలుగు పదం తట్టనేలేదు చూసారా. తట్టింది లెండి - ఐనా అభ్యాసం కూసు విద్య అననే అన్నారు.


మొదట ఈ లేఖినిని అందించిన వారికి నా కృతజ్ఙతలు ("కృతజ్ఙతలు" - ఈ పదము వ్రాయడానికి కొంచం కష్టపడవలసి వచ్చినదనుకొండి, చెప్పడానికి కాదులెండి) తెలుగులొ బ్లాగు వ్రాయడానికి కొంచము ఆలొచించాల్సి వచ్చింది, కొన్ని పదాలు మనము మాట్లాడేటప్పుడు వాడము కాని వ్రాసేటప్పుడు వాడుతాము. నా మొదటి డైలమా (చూసారా మళ్ళీ తెలుగు పదం రాలేదు) ఏమిటంటే బ్లాగులొ - ఆ పదాలు వాడాలా? మళ్ళీ ఇంత కాలానికి తెలుగులొ వ్రాస్తుంటే, తప్పులుంటే మా తెలుగు మాష్టరు తిడతారేమొ అనిపిస్తొంది. (స్కూల్లొ ఉన్నప్పుడే ఆ భయం లెదు - కాని ఇన్ని సంవత్సరాల తర్వాత వ్రాస్తుంటే - ఇదెదొ స్కూల్లొనే సరిగ్గా నెర్చుకొనుంటే సరిపొయెది కదా అనిపిస్తొందంతే)