Wednesday, September 19, 2007

ఇక్కట్ట్లు - II

మాట ఇచ్చేసాను... ఒప్పుకున్నాక తప్పదు, అది ఏమైనా కానివ్వండి. మా ఆఫిసులో ఒక కుర్రాడు trainee కింద చేరాడు. ఆ అబ్బాయి ఓసారి మాటల్లొ అదివరకు web site designing చేసాను అని చెప్పినట్ట్లు గుర్తు. ఇంకేం వెన్వెంటనే ఆఘమేఘాల మీద ఆ అబ్బాయిని పట్టుకొని - బాబు, నీకు ఏదొ వెబ్ సైట్లు చెయ్యడంలొ బోలెడు పరిచయం ఉన్నదట కదా! కాస్త ఈ పని చేసిపెట్టు - అని అడిగా. అలాగే అని అంటున్నప్పుడు ఆ అబ్బాయిని చూసి ఏందుకో అడగాలనిపించి - ఉండబట్టలేక - అడిగేసా: నాయనా, చిట్టి తండ్రి, ఇంతకు ముందు ఏమేమి చేసావు -
(ఈ మాణిక్యం తండ్రిగారేమో - నా పుత్రరత్నం internet, web, designing, development అంటూ నాకర్దంకాని ముక్కలేవో చెప్పి ఇప్పటికి చాలా తగలేసాడు, కాస్త మీ ఆఫిసులో పెట్టుకొని కాస్తొ కూస్తొ పని నేర్పించండి అని అడిగారు. ఆయనగారికి కుడా రత్నాలంటే నమ్మకముంది, కానీ డబ్బులు తగలేస్తున్నాడని బాధ).

అప్పుడసలు విషయం బయటపడ్డది - మణులు, మాణిక్యాలు కుడ రాళ్ళేనని. సరే, ఇప్పుడింక చేసేదేముంటుంది - అబ్బాయిగార్ని గూగ్లమని (అంటే - googleలొ వెదకమని), నేనున్ను కాస్త గూగ్లి - మొత్తానికో వారంతర్వాత ఓ వెబ్ సైట్ తయరు చేయ్యించా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, web site designing అంటే - ఆ అబ్బాయి భాషలొ graphics చేయడమట - బొమ్మలు మాత్రం బానే చేసాడు. ఒ సైట్లు హొస్టింగ్ చేసెవాడిని పట్టుకొని మొత్తానికి ఆ వెబ్ సైట్ హొస్ట్ చేయించా. అప్పుడు మొదలయ్యాయి ఇక్కట్లు...

మన కధలో ముఖ్య పాత్రధారైన మన ప్రియతమ మెజర్-జనరల్ గారు - వారు స్వయంగా, మరి వారి శిష్యపరమాణువైనటువంటి మా మిత్రుఁలుగారి ద్వారా, గంట లేక అరగంటకొక ఫొను చొప్పున - ఈ రాత్రి నిద్రపోయె ముందొకటి, రేపు నిద్ర లేస్తే ఇంకొకటి, ఆకలేస్తే ఎఱ్ఱది వెయ్యకపోతే పచ్చది అను చందాన - పైన రంగు బావుంది, కాని ఈ font రంగు ఇంకొంచం lightగా ఉంటే బావుంటుంది, మీరు పెట్టిన వినాయకుడి ఫోటో బావుంది - ఇంకొక వినాయకుడి ఫోటో ఉన్నదా?, ఇక్కడ ఈ రంగు కొంచం తెలికైంది, ఇలా అలా అంటూ.... ఒక్క రెండు వారాలు మాత్రమే మా జీవితాల్ని కొంచం కకలావికలం చేసారు. ఇంతా చేస్తే - అంతా బావుంది అనుకొనే సమయానికి - ఆయనగారికి మా మీద కోపమొచ్చింది - ఎందుకోననుకునేరు --- మేము పెళ్ళి కొడుకు/కూతురి వివరాలు నింపే పేజీలొ ఒక చిన్న తప్పు చేసాము...

******** తల్లి పేరు నింపడానికి ఉన్న field తండ్రి పేరు నింపడానికిచ్చినదానికంటే పెద్దదిగా ఉన్నది *******

7 comments:

  1. కొన్ని జీవితాలకు సంతృప్తి ఉండదనుకుంటాను.. ప్చ్.. ఇంతకీ ఏ స్క్రిప్టింగు బాస వాడుతున్నారు (పి.హెచ్.పీ, జె.ఎస్.పీ..)?

    ReplyDelete
  2. చాలా థాంక్స్!

    నాగరాజుగారు, మీ సుగుణ font నాకు బాగా నచ్చింది.

    ReplyDelete
  3. హహహ... ఏం తిప్పలో కదా మీకు. ఉచితంగా వాడుకోవడమే కాక ఎగస్ట్రాలా మళ్ళీ :)

    ReplyDelete
  4. మీ మేజరు గారి లాగా నేనో డాక్టరు గారిని చూసాను. అయితే ఆయన మెత్తగా ఇంజెక్షన్లు మాత్రం ఇచ్చేవాడు, అంతే! మేజరు గారు గన్ను గానీ తియ్యలేదు గదా మీ మీద!?:)

    ReplyDelete
  5. @నాగరాజు గారు - మొదట JSP వాడాము. తర్వాత దానిని Ruby on Railsలోకి మార్చాను.

    @
    "కట కటా"లంటే ఏమిటొ అనుకొన్నా! ఇప్పుడు తెలిసింది.

    ReplyDelete

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు