Wednesday, September 19, 2007

ఇక్కట్ట్లు - II

మాట ఇచ్చేసాను... ఒప్పుకున్నాక తప్పదు, అది ఏమైనా కానివ్వండి. మా ఆఫిసులో ఒక కుర్రాడు trainee కింద చేరాడు. ఆ అబ్బాయి ఓసారి మాటల్లొ అదివరకు web site designing చేసాను అని చెప్పినట్ట్లు గుర్తు. ఇంకేం వెన్వెంటనే ఆఘమేఘాల మీద ఆ అబ్బాయిని పట్టుకొని - బాబు, నీకు ఏదొ వెబ్ సైట్లు చెయ్యడంలొ బోలెడు పరిచయం ఉన్నదట కదా! కాస్త ఈ పని చేసిపెట్టు - అని అడిగా. అలాగే అని అంటున్నప్పుడు ఆ అబ్బాయిని చూసి ఏందుకో అడగాలనిపించి - ఉండబట్టలేక - అడిగేసా: నాయనా, చిట్టి తండ్రి, ఇంతకు ముందు ఏమేమి చేసావు -
(ఈ మాణిక్యం తండ్రిగారేమో - నా పుత్రరత్నం internet, web, designing, development అంటూ నాకర్దంకాని ముక్కలేవో చెప్పి ఇప్పటికి చాలా తగలేసాడు, కాస్త మీ ఆఫిసులో పెట్టుకొని కాస్తొ కూస్తొ పని నేర్పించండి అని అడిగారు. ఆయనగారికి కుడా రత్నాలంటే నమ్మకముంది, కానీ డబ్బులు తగలేస్తున్నాడని బాధ).

అప్పుడసలు విషయం బయటపడ్డది - మణులు, మాణిక్యాలు కుడ రాళ్ళేనని. సరే, ఇప్పుడింక చేసేదేముంటుంది - అబ్బాయిగార్ని గూగ్లమని (అంటే - googleలొ వెదకమని), నేనున్ను కాస్త గూగ్లి - మొత్తానికో వారంతర్వాత ఓ వెబ్ సైట్ తయరు చేయ్యించా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, web site designing అంటే - ఆ అబ్బాయి భాషలొ graphics చేయడమట - బొమ్మలు మాత్రం బానే చేసాడు. ఒ సైట్లు హొస్టింగ్ చేసెవాడిని పట్టుకొని మొత్తానికి ఆ వెబ్ సైట్ హొస్ట్ చేయించా. అప్పుడు మొదలయ్యాయి ఇక్కట్లు...

మన కధలో ముఖ్య పాత్రధారైన మన ప్రియతమ మెజర్-జనరల్ గారు - వారు స్వయంగా, మరి వారి శిష్యపరమాణువైనటువంటి మా మిత్రుఁలుగారి ద్వారా, గంట లేక అరగంటకొక ఫొను చొప్పున - ఈ రాత్రి నిద్రపోయె ముందొకటి, రేపు నిద్ర లేస్తే ఇంకొకటి, ఆకలేస్తే ఎఱ్ఱది వెయ్యకపోతే పచ్చది అను చందాన - పైన రంగు బావుంది, కాని ఈ font రంగు ఇంకొంచం lightగా ఉంటే బావుంటుంది, మీరు పెట్టిన వినాయకుడి ఫోటో బావుంది - ఇంకొక వినాయకుడి ఫోటో ఉన్నదా?, ఇక్కడ ఈ రంగు కొంచం తెలికైంది, ఇలా అలా అంటూ.... ఒక్క రెండు వారాలు మాత్రమే మా జీవితాల్ని కొంచం కకలావికలం చేసారు. ఇంతా చేస్తే - అంతా బావుంది అనుకొనే సమయానికి - ఆయనగారికి మా మీద కోపమొచ్చింది - ఎందుకోననుకునేరు --- మేము పెళ్ళి కొడుకు/కూతురి వివరాలు నింపే పేజీలొ ఒక చిన్న తప్పు చేసాము...

******** తల్లి పేరు నింపడానికి ఉన్న field తండ్రి పేరు నింపడానికిచ్చినదానికంటే పెద్దదిగా ఉన్నది *******

Monday, September 17, 2007

ఇక్కట్ట్లు - I

కొన్నాళ్ళ క్రితం నేనొక మేజర్-జనరల్ని కలిసాను. ఆయన నేను softwareలొ ఉన్నానని తెలుసుకొని నన్నొక website చేసి పెట్టమని అడిగారు. వెబ్ సైట్ చేసి పెట్టమనడం బానే ఉంది - కాని అక్కడే ఒక చిన్న చిక్కొచ్చి పడ్డది - నేనింతవరకు ఒక్క web site కుడా చెయ్యలేదు. అసలా వైపుకే చూడలేదు. ఇటు చూస్తే ఈ మేజర్-జనరల్ గారెమొ - అబ్బాయి - నీకేమొ computersలొ అన్ని విశేషాలు తెలుసు కదా ఏది ఈ చిన్న పని చేసిపెట్టు అని... (వెధవది నోరు ఊరుకోదు కదా - ఏమి చేస్తుంటావబ్బాయి అని అడిగితే - ఓ ఇదిని లేదు, అదని లేదు computerలు, softwareలొ విరగ తీసేస్తుంటా అని బడాయికిపోయా - అంతే ఇరుక్కుపోయా; ఊరికే అన్నారా - నోరా వీపుకి తేకే అని!) - సరే ఏమి చేస్తాం!! అలాగేనండి చేస్తాను అనక తప్పింది కాదు.

ఇహ్హ చూడండి నా పాట్లు!!! అసలే చఛ్చేంత పని ఆఫిసులొ... దొరికేదే ఏదో ఒక శనివారమొ లేక ఆదివారమొ అందులొ ఎన్ని పనులు - ఆ రెండు రోజులే చాకలివాడి దగ్గర్నించి ఎలక్రీషియను, పంపులు బాగు చేసేవాడు, కిరాణా వాడు - వాడూ వీడని లేదు అందరూనూ - ఈ రెండు రోజుల్లోనే దిగుతారు. దాని మీద ఈ మేజర్-జనరల్ గారి ఫోన్లు! అబ్బాయ్ "రేపటికల్లా చేసేస్తావా!" అని.

చెయ్యడం పెద్ద సమస్య కాదు, చెయ్యడానికి సమయం దొరికించుకోవడం పెద్ద సమస్య అయ్యింది. ఎలా చెప్పేది ఆయనగారికి - ఊపిరి తీసుకోలేనంత పని నాయనా - ఏవరికైనా ఓ వెయ్యో వందో ఇచ్చి చేయించుకోవచ్చుకదా అని - దానికి తోడు ఏ స్నేహితుడివల్ల ఈ మేజర్-జనరల్ గారి పరిచయం అయ్యిందో - ఆయన శిష్యపరమాణువీమా మిత్రులుఁగారు!! ఆ! మా గురువుగారు కోరక కోరక నిన్ను చూడగానే ఎందుకనో ఓ కోరిక కోరారు - నువ్వేంటి! ఇలాంటి సలహాలు అంటూ నాకు వాయింపు! దానికి తోడు, అదేమైనా మాములు వెబ్ సైటా - matrimonials! - పెళ్ళి ప్రకటనల సైటు!

సశేషం

Sunday, September 16, 2007

బారసాల


ఇది నా మొదటి బ్లాగు - తెలుగులొ. అంటే ఇంతకు ముందు నేను బ్లాగులు వ్రాసాను కానీ, అన్ని ఆంగ్లం లొనే వ్రాసాను. కాగితం మీద వ్రాయదం ఏంత సులభమొ, ఈ కంప్యుటెర్ కీప్యాడుతొ టైపు చెయడం కొంచం కష్ఠమే.లేఖిని చాలా బావుంది మరియు టైపు చెయడం సులభంగానె ఉంది, కొంత ప్రాక్టీసు కావాలనుకొండి. రొజువారి కార్యక్రమాల్లొ ఆంగ్లం (ఇంగ్లీష్ అని వ్రాయడం కొంచం కష్ఠమే లేఖినిలొ) ఏంతగా వాడుతున్నామంటే చాలా పదాలు తెలుగులొకి తర్జమా చెసుకొని వ్రాయవలసి వస్తొంది. నాకు ఇంకా ప్రాక్టీసుకి తెలుగు పదం తట్టనేలేదు చూసారా. తట్టింది లెండి - ఐనా అభ్యాసం కూసు విద్య అననే అన్నారు.


మొదట ఈ లేఖినిని అందించిన వారికి నా కృతజ్ఙతలు ("కృతజ్ఙతలు" - ఈ పదము వ్రాయడానికి కొంచం కష్టపడవలసి వచ్చినదనుకొండి, చెప్పడానికి కాదులెండి) తెలుగులొ బ్లాగు వ్రాయడానికి కొంచము ఆలొచించాల్సి వచ్చింది, కొన్ని పదాలు మనము మాట్లాడేటప్పుడు వాడము కాని వ్రాసేటప్పుడు వాడుతాము. నా మొదటి డైలమా (చూసారా మళ్ళీ తెలుగు పదం రాలేదు) ఏమిటంటే బ్లాగులొ - ఆ పదాలు వాడాలా? మళ్ళీ ఇంత కాలానికి తెలుగులొ వ్రాస్తుంటే, తప్పులుంటే మా తెలుగు మాష్టరు తిడతారేమొ అనిపిస్తొంది. (స్కూల్లొ ఉన్నప్పుడే ఆ భయం లెదు - కాని ఇన్ని సంవత్సరాల తర్వాత వ్రాస్తుంటే - ఇదెదొ స్కూల్లొనే సరిగ్గా నెర్చుకొనుంటే సరిపొయెది కదా అనిపిస్తొందంతే)