Monday, September 17, 2007

ఇక్కట్ట్లు - I

కొన్నాళ్ళ క్రితం నేనొక మేజర్-జనరల్ని కలిసాను. ఆయన నేను softwareలొ ఉన్నానని తెలుసుకొని నన్నొక website చేసి పెట్టమని అడిగారు. వెబ్ సైట్ చేసి పెట్టమనడం బానే ఉంది - కాని అక్కడే ఒక చిన్న చిక్కొచ్చి పడ్డది - నేనింతవరకు ఒక్క web site కుడా చెయ్యలేదు. అసలా వైపుకే చూడలేదు. ఇటు చూస్తే ఈ మేజర్-జనరల్ గారెమొ - అబ్బాయి - నీకేమొ computersలొ అన్ని విశేషాలు తెలుసు కదా ఏది ఈ చిన్న పని చేసిపెట్టు అని... (వెధవది నోరు ఊరుకోదు కదా - ఏమి చేస్తుంటావబ్బాయి అని అడిగితే - ఓ ఇదిని లేదు, అదని లేదు computerలు, softwareలొ విరగ తీసేస్తుంటా అని బడాయికిపోయా - అంతే ఇరుక్కుపోయా; ఊరికే అన్నారా - నోరా వీపుకి తేకే అని!) - సరే ఏమి చేస్తాం!! అలాగేనండి చేస్తాను అనక తప్పింది కాదు.

ఇహ్హ చూడండి నా పాట్లు!!! అసలే చఛ్చేంత పని ఆఫిసులొ... దొరికేదే ఏదో ఒక శనివారమొ లేక ఆదివారమొ అందులొ ఎన్ని పనులు - ఆ రెండు రోజులే చాకలివాడి దగ్గర్నించి ఎలక్రీషియను, పంపులు బాగు చేసేవాడు, కిరాణా వాడు - వాడూ వీడని లేదు అందరూనూ - ఈ రెండు రోజుల్లోనే దిగుతారు. దాని మీద ఈ మేజర్-జనరల్ గారి ఫోన్లు! అబ్బాయ్ "రేపటికల్లా చేసేస్తావా!" అని.

చెయ్యడం పెద్ద సమస్య కాదు, చెయ్యడానికి సమయం దొరికించుకోవడం పెద్ద సమస్య అయ్యింది. ఎలా చెప్పేది ఆయనగారికి - ఊపిరి తీసుకోలేనంత పని నాయనా - ఏవరికైనా ఓ వెయ్యో వందో ఇచ్చి చేయించుకోవచ్చుకదా అని - దానికి తోడు ఏ స్నేహితుడివల్ల ఈ మేజర్-జనరల్ గారి పరిచయం అయ్యిందో - ఆయన శిష్యపరమాణువీమా మిత్రులుఁగారు!! ఆ! మా గురువుగారు కోరక కోరక నిన్ను చూడగానే ఎందుకనో ఓ కోరిక కోరారు - నువ్వేంటి! ఇలాంటి సలహాలు అంటూ నాకు వాయింపు! దానికి తోడు, అదేమైనా మాములు వెబ్ సైటా - matrimonials! - పెళ్ళి ప్రకటనల సైటు!

సశేషం

4 comments:

  1. ఈ మేజరు-జనరలు మహా తెలివైన వారులా ఉన్నారే :-)

    ReplyDelete
  2. నాకూ అదే ఆశ్చర్యం అనిపించింది. మేజర్-జనరల్ ఏమిటి - తెలివితేటలు చూపించడమేమిటి అని!

    ReplyDelete
  3. Matrimonial site అన్నారు కద... మీకు పెళ్ళి కాకుంటే పనిలో పనిగా చూసేసుకోండి... :))

    ReplyDelete
  4. :) ఆ సైట్ ఇక్కడ northలొ చతుర్వేది అని ఒక communityఉన్నదట - వారి కోసం మాత్రమే!

    ReplyDelete

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు