Sunday, September 16, 2007
బారసాల
ఇది నా మొదటి బ్లాగు - తెలుగులొ. అంటే ఇంతకు ముందు నేను బ్లాగులు వ్రాసాను కానీ, అన్ని ఆంగ్లం లొనే వ్రాసాను. కాగితం మీద వ్రాయదం ఏంత సులభమొ, ఈ కంప్యుటెర్ కీప్యాడుతొ టైపు చెయడం కొంచం కష్ఠమే.లేఖిని చాలా బావుంది మరియు టైపు చెయడం సులభంగానె ఉంది, కొంత ప్రాక్టీసు కావాలనుకొండి. రొజువారి కార్యక్రమాల్లొ ఆంగ్లం (ఇంగ్లీష్ అని వ్రాయడం కొంచం కష్ఠమే లేఖినిలొ) ఏంతగా వాడుతున్నామంటే చాలా పదాలు తెలుగులొకి తర్జమా చెసుకొని వ్రాయవలసి వస్తొంది. నాకు ఇంకా ప్రాక్టీసుకి తెలుగు పదం తట్టనేలేదు చూసారా. తట్టింది లెండి - ఐనా అభ్యాసం కూసు విద్య అననే అన్నారు.
మొదట ఈ లేఖినిని అందించిన వారికి నా కృతజ్ఙతలు ("కృతజ్ఙతలు" - ఈ పదము వ్రాయడానికి కొంచం కష్టపడవలసి వచ్చినదనుకొండి, చెప్పడానికి కాదులెండి) తెలుగులొ బ్లాగు వ్రాయడానికి కొంచము ఆలొచించాల్సి వచ్చింది, కొన్ని పదాలు మనము మాట్లాడేటప్పుడు వాడము కాని వ్రాసేటప్పుడు వాడుతాము. నా మొదటి డైలమా (చూసారా మళ్ళీ తెలుగు పదం రాలేదు) ఏమిటంటే బ్లాగులొ - ఆ పదాలు వాడాలా? మళ్ళీ ఇంత కాలానికి తెలుగులొ వ్రాస్తుంటే, తప్పులుంటే మా తెలుగు మాష్టరు తిడతారేమొ అనిపిస్తొంది. (స్కూల్లొ ఉన్నప్పుడే ఆ భయం లెదు - కాని ఇన్ని సంవత్సరాల తర్వాత వ్రాస్తుంటే - ఇదెదొ స్కూల్లొనే సరిగ్గా నెర్చుకొనుంటే సరిపొయెది కదా అనిపిస్తొందంతే)
Subscribe to:
Post Comments (Atom)
స్వాగతం సూర్యప్రతాప్ గారూ!:) మీరన్నట్టు కాస్త సాధన ఉంటే తెలుగులో రాయడం అలవాటై తప్పులు తప్పుకుంటాయి లెండి.
ReplyDeleteచాలా థాంక్స్ చదువరిగారు. పద ప్రయోగంలొ చాలా కృషి చేసినట్లున్నారు మీరు. బావుంది.
ReplyDeleteచాలా థాంక్స్, జాలయ్యగారు.
ReplyDeleteతెలుగులో రాస్తుంటే మన తెలుగు ఆలోచనా స్రవంతికూడా విస్తరించి ఎక్కడో బుర్రలో ఒక మూలన దాక్కున్న తెలుగు పదాలన్నీ అలా అలవోకగా వచ్చేస్తాయన్నమాటా..హిహిహి
ReplyDeleteఇక టపాల నిప్పులు కురిపించండి
hai this is ur blog reader, i feel happy that u r trying to write ur blogs in telugu very good keep it up,
ReplyDeletecan u help me how to create a meter on my blog aslo.
@దాదాపీర్ గారు
ReplyDeleteనా జవాబు మీకు చేరిందనుకొంటా. మీ సైట్ మీటర్ తయారైందా?
@తెలుగువీర
ReplyDeleteమీరన్నది నిజమే... ఏంటొ అలా పదాలన్ని గుర్తుకొచ్చేస్తున్నాయి... హి హిహి..
ఏం నిప్పులో ఏమిటో... వ్రాసినదెమిటొ చదవకుండా వ్యాఖ్యలు చేసెవాళ్ళే ఉన్నట్టున్నారు.