Thursday, October 11, 2007

సూర్యుడు - II - భూమి, పాలపుంత

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందని మనం స్కూల్లో చదివాము. దాని గురించి కొన్ని వి-శేషాలు:
భూమి తన చుట్టూ తాను - 460 మైళ్ళ ప్రతి సెకను వేగంతో తిరుగుతొంది. అంటే, భూమధ్య రేఖ మీద మీరు గనక నించొని ఉంటే - మీరు గంటకి ఇరవై ఏడు వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నారన్న మాట. ఏంటో కార్లో గంటకి ఎనభై మైళ్ళ వేగంతో వెళ్ళి సంతోషించేస్తాము!
మీరు తిరుగుతున్నారు అనే కంటే - భూమి మిమ్మల్ని తిప్పుతొందన్న మాట సరైనదేమో. (మనకన్నా చంద్రుడు చిన్న వాడైనా - చంద్రుని ఆకర్షణ శక్తివల్ల భూమి తిరిగే వేగం వంద సంవత్సరాలకి 2 ఎం.ఎం. చొప్పున తగ్గిపోతొంది.)

మరి ఇదొకటే కాదు - సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాముగా - మనల్ని భూమి సూర్యుడి చుట్టూ గంటకి నలభై వేల కి.మి. వేగంతో తీసుకొని వెళ్తోంది. ఇవన్ని మనం స్కూల్లో తెలుసుకొనే ఉంటాము.

సూర్యుడు కుడా తనచుట్టూ తాను తిరుగుతాడు - మధ్య రేఖ వద్ద తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై ఏడు రోజులు తీసుకొంటాడు. [The sun is so big that it takes from 25-32 days / equator to poles] అంటే సూర్యుని భూమధ్య రేఖ మీద గనక మీరు నుంచొంటే (నుంచోగలిగితే అనాలేమో) - మీరు గంటకి నాలుగు వేల ఐదు వందల మైళ్ళ వేగంతో తిరుగుతున్నారనమాట.

ఇవేవి కాకుండా - సూర్యుడు మన గెలాక్సి చుట్టూ కుడా తిరుగుతాడు. సెకనుకి రెండు వందల కి.మి పైగా వేగంతో సూర్యుడు మనని గెలాక్సి చుట్టూ తిప్పుతున్నాడు.

కొంచం అలా పక్కకి వెళ్దాం - కొంచం సేపే - మళ్ళి వెనక్కొచేద్దాం లేండి -
పార్-సెక్ అని దూరాన్ని సూచించే కొలత ఒకటుంది. ఒక పార్-సెక్ అంటే 3.262 కాంతి సంవత్సరాలు.
అవునండోయి - కాంతి సంవత్సరము అంటే 1 సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం అన్న మాట: సూర్యుడి నించి కాంతి మన దగ్గరకి రావడానికి ఎనిమిది నిమిషాల ముఫ్పైఒక్క సెకనులు పడుతుంది, మీరే ఊహించండి - ఒక సంవత్సరంలో ఎంత దూరం వెళ్తుందో.

మన సూర్యుడు మన గెలాక్సి మధ్యనించి ఎనిమిది వేల పార్-సెక్_ల దూరంలొ ఉన్నాడు.
Voyager అనే అంతరిక్ష నౌక మన భూమికి 0.00046 పార్-సెక్_ల దూరం వెళ్ళడానికి ఇరవైఏడు సంవత్సరాలు తీసుకొంది. (ఎక్కడికి వెళ్ళిందనుకొన్నారు - ప్లూటో దాటిందంతే!).
మనం మన గెలాక్సి మధ్యకి వెళ్ళడానికి ప్రయాణమైతే ఎంత సమయం తీసుకొంటామో మీరే లెఖ్ఖ వెయ్యండి.
ఇంకొక విషయం చూసి - మళ్ళీ మనం మన వేగాల్లోకి వచ్చేద్దాము. మన సూర్యుడు నాలుగువేల ఏడువందల మిలియన్ సంవత్సరాల వయస్సున్నవాడు. ఇంకా, ఐదువేల మిలియన్ సంవత్సరాల వయస్సు మిగిలి ఉంది. అంతే సూర్యుడి ఆయుషు 100 అనుకొంటే - ఇప్పుడు సూర్యుడి వయస్సు 47 అన్నమాట.
ఈ నాలుగువేల చిల్లర మిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడు మన గెలాక్సి చుట్టూ ఎన్ని సార్లు తిరిగాడో ఊహించండి - మహా అంటే ఇరవై సార్లు! చూసారా... ఎంతెంత దూరాలో!




మనమూ తిరిగి - సూర్యుడూ తిరిగి - మరి మన గెలాక్సి తిరగకుండా ఉంటుందా! మన గెలాక్సి హైడ్రా అనే గెలాక్సి వైపుకి ఎంత మెల్లగా ప్రయణిస్తోందంటే - ఒక్క రోజులో అది భూమిని యాభై మిలియన్ కి.మి. దూరం లాక్కెళుతొంది - అంటే ప్లూటో కనక కదలకుండా ఉంటే - మనం దానిని మూడు నెలల కంటే తక్కువ సమయంలో చేరుకొంటామన మాట...
Voyager 1కి ఏంత సమయం పట్టిందో గుర్తుందిగా...
just 27 years!!!


గమనిక - మన భూమి కదలకుండా ఉంటే - సూర్యుడు మన దగ్గరికి ఎనిమిది రోజుల్లో చేరి పొతాడు.

2 comments:

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు