మన సూర్యుడు కుడా మన భూమి లాగే ఒక పెద్ద అయస్కాంతం. మరి అంత పెద్ద అయస్కాంతానికి ఎంత పెద్ద క్షేత్రముంటుందో ఊహించండి!
(అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రముంటుంది - అంటే ఆ ప్రదేశములో ఆ అయస్కాంతము యొక్క ఆకర్షణ లేదా వికర్షణా శక్తి ప్రభావం తెలుస్తుందన్నమాట).
సూర్యుని అయస్కాంత క్షేత్రం ప్లూటోని దాటి ఉంటుంది.
ఇందులో ఇంకొక విషయమేమిటంటే - మరి అంత పెద్ద అయస్కాంతం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే దాని క్షేత్రం ఎలా ఉంటుంది? అయస్కాంతాలు కదిలితే అవి కరెంటుని కుడా ఉత్పత్తి చేస్తాయిగా - ఈ electro magnetic క్షేత్రం ఎలా ఉంటుంది...
ఈ పటం చూడండి - మీకే తెలుస్తుంది...
మరి భూమి కుడా అయస్కాంతమే కదా - మరి ఈ రెండు అయస్కాంత క్షేత్రాల వల్ల ఏం జరుగుతుంది?
భూమి యొక్క అయస్కాంతక్షేత్రాన్ని సూర్యుని క్షేత్రం compress చేస్తుంది. అలా చేయడంవల్ల భూఅయస్కాంత క్షేత్రం సూర్యుడికి వ్యతిరేక దిశలో ఒక తోకలా ఏర్పడుతుంది - ఈ తోక కుడా ప్లూటోని దాటుకొని వ్యాపిస్తుంది.
సూర్యునినించి వచ్చే అయానులు కొన్ని ఈ తోకలో చిక్కుకొని - ఎప్పట్టికీ అందులొనే తిరుగుతుంటాయి.
అలాగే సూర్యుని నించి వచ్చే అయానులు మన భూమి atmosphereని తాకినప్పుడు - కాంతిని విడుదల చేస్తాయి -- ఇవి మనకి ఉత్తర, దక్షిన ధ్రువాల దగ్గర బాగా కనిపిస్తాయి - ఇవేమిటో తెలుసా? ...
Northern and Sourthern Lights.
తెలుగు కాక ఆంగ్ల పదాలు వాడానంటే - అప్పుడక్కడ దానికి తెలుగు పదం తట్టలేదన్న మాట! - ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి.
చాలా మంచి విషయలు రాసినారు, మీ టపా నా నెనర్లు. సూర్యుడులో అన్ని H-బాంబులు పేలుతుంటే దాని చుట్టు నిశబ్ధముగా ఉండును, ఎందుకంటే అక్కడ అంత శ్యూనం (వాతావరణం లేదు) కనుక. అందుకే ఈ మధ్య ఒక శాస్త్రవేత్త, నాసా వారి సూర్యుడు వీడియోకి మ్యూజిక్ కంపోజ్ చేసినాడు, అదే సోలార్ సౌండ్స్ (computerతో, దానికి ఒక పద్ధతి ఉన్నది.. త్వరలో.. మర్మ-మరాలలో చదవండి).
ReplyDelete-మరమరాలు
థాంక్స్. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసాడు అనే కంటే - సూర్యిడి నించి వచ్చే రెడియేషన్ ను SOHO ద్వారా నలభై రోజులు రెకార్డ్ చేసి - దానిని మనుషులకు వినిపించే రేంజ్ కి కుదించి మొత్తం 1.3 నిమిషాల శబ్దం క్రింద మార్చాడు. దీనిలో ఆయన మూడు టోన్స్ లేదా మోడ్స్ ని గుర్తించాడు. ఈ ఫైల్ చాలా పెద్దది అవ్వడం చేత ఇక్కడ ఉంచడం జరగలేదు.
ReplyDelete