Thursday, October 11, 2007

త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్...

ఇసాక్ ఆసిమొవ్ అనే ఒక శాస్త్రవేత్త, సైన్స్ ఫిక్షన్ కధలు చాలా వ్రాసారు. ఆయన రోబోట్లను గురించి చాలా కధలు వ్రాసారు, ఆయన చాలా కధలలో రోబోట్లు ప్రధాన పాత్రధారులు. మరి ఈ రోబోట్లను నియంత్రించే నియమాలు కుడా ఆయన సూత్రికరించారు. వీటినే "త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్" అని అంటారు - ఆ మూడు సూత్రాలేమిటంటే -

1. ఓ రోబోట్ తన చర్యలవల్ల కాని, లేక చర్య తీసుకోక పోవటంవల్ల కాని మానవునికి హాని చేయరాదు.

2. ఓ రోబోట్ సదా మానవుని ఆజ్ఞలనను పాటించాలి, ఆ ఆజ్ఞలు మొదటి సూత్రానికి వ్యతిరేకం కానంత వరకు.

3. ఓ రోబోట్ తనని తాను కాపాడుకోవాలి, మొదటి రెండు సూత్రాలను ధిక్కరించనంతవరకూ.


ఈ సూత్రాలనాయన ఎందుకు ప్రతిపాదించారంటే, మానవులకి యంత్రాలంటే కొంచం భయం. అందులోనూ, తమంతట తాము ఆలోచించి, నిర్ణయాలు తీసుకొని పని చేయగలిగే యంత్రాలంటే మరీను. ఈ భయాన్ని లాభం క్రింద మార్చుకొన్న సినిమాలు చాలా ఉన్నాయి. మేరీ షెల్లి వ్రాసిన ఫ్రాంకెన్-స్టైన్ అనే నవల ఇలాంటిదే, టేర్మినేటర్ సినిమాలు అలాంటివే. అందులో ఈ intelligent యంత్రాలు యుధ్దాలకి, భయాందోళనలు కలిగించడానికి తప్ప దేనికి వాడరు. కాని ఇసాక్ ఆసిమోవ్ రోబోట్లు, మన దైనందిన జీవితంలో భాగంగా కనిపిస్తాయి. అలా కనిపింపచేయడం కోసమే - ఈ మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ఆయన వ్రాసిన మొదటి కధలలో - ఈ రోబోట్లు ఎవరికీ హాని చేయవు అని చూపించే కధలే. (అలా అని తర్వాతి కధల్లో హాని చెస్తాయని కాదు). రోబోటిక్స్ అనే పదాన్ని మొదటి సారిగా వాడింది ఈయనే.

4 comments:

  1. జీరోత్ సూత్రం చెప్పాలంటే - ఆర్. డానీల్ గురించి చెప్పాలి. రోబోట్లు మానవుని కంటే కుడా మానవుని క్షేమం గురించి ఎంత బాగా ఆలోచించగలవో చెప్పాలి. జీరోత్ లా తర్వాత ఈ మూడు సూత్రాలు ఎలా మార్పుచేయబడ్డాయో - దాని గురించి ఇంకొక పోస్ట్ లో...!

    ReplyDelete
  2. For better understanding, readers can watch the movie 'I, robot'.

    ReplyDelete
  3. లేదు - I, Robot సినిమా ఆసిమోవ్ రోబోట్ లా లను సరిగ్గా వాడదు. ఆయన వ్రాసిన పుస్తకం I, Robotకి ఈ సినిమాకి పొంతన లేదు. ఆయన వ్రాసిన కధలకి ఈ సినిమాకి చాలా తేడాలున్నాయి.

    ReplyDelete

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు