అసలీ మతం అనేది కనుక్కొన్నవాడు చాల గొప్ప సైకాలజిస్టు - అందులోను Mob Psychologyలో స్పెషలిస్ట్ అయ్యుంటాడు. He has practically demonstrated such an ultimate weapon for mind control, which is never used up as long as there are people. This control mechanism based on the insecurities and fears, ego and pride of the people, coupled with judicious use of "under education", "lack of awareness", "dis-information" and "filtered information flow" - I think is the greatest invention of all time!. To incite people based on an intangible idea, based on something that no one has seen, observed and so vague and abstract! - and to make them (people) feel personally affronted about it - when someone comments on it! - definitely the greatest mass psychologist ever! వాడికో ఇరవైయ్యొ ముఫ్పయ్యో నోబెల్ పురస్కారాలు ఇచ్చెయ్యవచ్చు. నా ఉద్దెశ్యం - కత్తిని కంట్రొల్-కొసం వాడవచ్చు అనే విషయం కనుక్కొన్నప్పుడే - కత్తికి కత్తి సమాధానమైతే ఎవరో ఒకరే మిగలవచ్చు లెదా ఇద్దరు చచ్చి మూడొవాడెవ్వడో అధికారాన్ని ఎగరేసుకుపోవచ్చు, ఇలా కాదు - ఈ కత్తిని మనమేలా కంట్రొల్ చెయ్యవచ్చా అని ఆలొచించి వుంటాడెవడో! అందులొంచి పుట్టిన ఆలోచనే ఈ మతం.
ఈ మధ్య కొన్ని బ్లాగులు చూసాను - ఇస్లాము, మతము, హిందుత్వము, రాముడు, సేతువు అంటూ ఇంకా చాలా చాలా వ్రాసారు. చాలా మంది, భలే వ్రాసారు, బోల్డు బాగా వ్రాసారు అంటు వ్యాఖ్యలు. వాళ్ళెవరో మారాలి, ఇంకా సమాజం మారాలి అంటూ విశ్లెషణ. మరి ఇంత చెప్పినవాళ్ళు - కరుణానిధి ఏదో అన్నాడని కత్తులు కట్టార్లు అంటు బ్లాగులు, వ్యాఖ్యలు ఎందుకు వ్రాసినట్టూ? అప్పుడు గుర్తుకురాలేదా - తామంటున్నది తీవ్రవాద భాషలొనే అని? చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు - కోపమొచ్చింది అందుకే అలా అన్నాను అని సమర్ధించుకోగా లేనిది, సరైన చదువు లేక, చుట్టూ తమవాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియక, రేపు అనేది వాళ్ళ బ్రతుకుల్లో అసలు ఉదయిస్తుందో లేదో తెలియని స్థితిలో, ఆ frustation, ఆ చేతగానితనంలో తమ మీద తామే అసహ్యం ద్వేషం పెంచుకొన్నవాళ్ళకి, జీవితమంటే ఏమిటో సరైన అవగాహన లేని వాళ్ళకి, ఎవరో కొందరు తమ స్వార్థం కోసం ఇదిగో, నీకు, నీవాళ్ళకి జరుగుతున్నదానికి వీళ్ళే బాధ్యులు అని చేతికొక తుపాకి ఇస్తే - ఏమిటి జరిగేది? ఆఁ ఇవన్నిటికి మనమేమి చేయగలుగుతాం, మన చేతిలో ఏముంది అని అనేవాళ్ళకి ఒకటే ప్రశ్న - ఏం! మీరీ సమాజంలో భాగం కాదా? ఇదేం ద్వంద్వప్రవ్రుత్తి. నేనింతక్రితం వ్రాసిన బ్లాగు - "నమ్మకం..." లో వ్యాఖ్యలు కొన్ని చూసి నవ్వు వచ్చింది. అందులో వ్యాఖ్యలు చేసిన కొద్దిమంది మరికొన్ని బ్లాగుల్లొ - సమాజం మారాలి, రాజకీయనాయకులు వోట్లకొసం వెస్తున్న వేషాలివి అంటు...
ఎందుకో ఇంత hypocrisy?
Wednesday, October 3, 2007
Subscribe to:
Post Comments (Atom)






2 comments:
సంఘటనను బట్టి సమర్ధింపు మారుతుంది కదండి.
మంచి పాయింటు.
Post a Comment
మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు