ఓసారొక salesman ఒకింటి తలుపు తడతాడు.
కొంతసేపటికి ఓ పదెళ్ళ కుఱ్ఱాడు, ఓ చెతిలో బీరుగ్లాసు ఇంకొక చేతిలొ సిగరెట్టుతో, వచ్చి తలుపు తీస్తాడు.
salesman - "మీ అమ్మ కానీ నాన్న కాని ఉన్నారా?".
కుఱ్ఱవాడడుగుతాడు - "నువ్వేమనుకొంటున్నావు?"
***********
ఓ ఆరేళ్ళ పిల్లాడు, పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అడుగుతాడిలా -
"అమ్మా, అమ్మా, నేనెలా పుట్టనే?".
"నేనొసారి, నాకూ ఒక బుజ్జి బాబు కావాలి అని దేముడ్నడిగాను - అప్పుడు దేముడు నాకు నిన్నిచ్చాడు". "మరి నువ్వో?".
"మా అమ్మ కుడా, ఇలాగే దేముడ్ని అడిగింది - అప్పుడు దేముడు నన్ను మా అమ్మకిచ్చాడు".
"మరి అమ్మమ్మో?"
"అలాగే".
"మరి నాన్నో".
"బామ్మ కుడా అలాగే చేసింది".
"మరింకా తాత, బామ్మా అందరూ అంతేనా, అలాగే పుట్టారా?".
"అవును బాబు, అందరు అలాగే పుట్టారు".
అ పిల్లాడు కొంచంసేపు ఆలొచించి అంటాడు -
"అంటే, మనవాళ్ళళ్ళో ఎవరూ సహజంగా పుట్టలేదనమాట!"
Thursday, September 27, 2007
Subscribe to:
Post Comments (Atom)






0 comments:
Post a Comment
మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు