Monday, September 24, 2007

రాక్ సాంగ్స్

నాకు మొదటి నుండి తెలుగు పాటల కన్నా english పాటలే నచ్చేవి. ఎందుకంటారా, మరి "గ్గు.. గ్గు.. గుడిసుంది...", "నీ వళ్ళు బంగారంగాను..." ఇవి All time Hits!, అబ్బే - అలా కాదు అనుకొంటే - తిక్క రేగిందా, తిమ్మిరెక్కిందా, లేక పొతే ఏడుపు పాటలు, కాక పొతే భక్తి సంగీతం. ఇవన్ని కాక పొతే - ఆ డిడిలొ లలిత సంగీతం అని -ఏడుస్తున్నాడో, పాడుతున్నాడొ తెలియని పాటగాళ్ళు. నాకెందుకనొ (అప్పటికి నేనింకా 4లుగొ 5దొ తరగతి లొ ఉండి ఉండచ్చు - dates అంతగా గుర్తు లేవు) వీటి కంటే Daddy Cool, Reason to believe, Rasputin, MJ Thriller, Bad ఇవి బాగా నచ్చేవి. అసలిందుకు, మా బావకి థాంక్స్ చెప్పాలి. మా బావలిద్దరు నన్ను ఈ పాటలకి పరిచయం చేసారు. మా పెద్ద బావ బాగా పాడగలడు కుడా, అది కుడా ఘంటసాల పాటలు. ఒక సారి ఇందులొ పడ్డ తర్వాత ఇంక అలా అలా Blues, Rock, Hard Rock, RB Singles categories ఇవన్ని తెలిసొచ్చాయి. మన తెలుగు పాటల్లొ బావుండేవి, బావుండనివి, చెత్తగా, ఇంకా పరమ చెత్తగా ఉన్నట్టే english లొ కుడా ఉన్నాయి. కాని ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే - బావుండేవి, చాలా బావుండేవి మాత్రమే ఆ దేశాలు దాటి ఇక్కడ వరకు వచ్చేవి. అందువల్ల చాలా వరకు అన్ని పాటలు నచ్చేవి. (ఇప్పుడు అక్కడ release అవ్వడానికి ముందే ఇక్కడ పైరేటెడ్ దొరికేస్తున్నాయి... ఆ సంగతులు తర్వాత).
చాలా మంది - ఏంటవి అలా పెద్ద పెద్ద శబ్దాలు (అప్పుడు నే వాడెది ఒక చిన్న National Panasonic Tape Recorder!) అంతా గందరగోళంగా ఉంది.... ఎందుకా పాటలు - ఇవి comments. ఆ తర్వాత (ఒకట్రెండు సంవత్సరాల తర్వాత నాకొక విషయం తెలిసింది - ఎంత పెద్ద system ఉంటే ఈ పాటలు అంత బాగా ఉంటాయని - it's not about volume - it's about clarity). ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే - మొన్న మా friends నాకొక పాట వినిపించి, నువ్వు michael jackson పాటలు కుడా అర్ధం చేసుకొగలవు కదా - ఏది ఈ పాటేంటొ చెప్పమంటే - నాకసలు వాడే భాషలొ పాడుతున్నాడొ కనుక్కొవడానికి కొంచం సమయం పట్టింది. చివరికి ఆ పాటెంటొ చెప్పానను కొండి, ఆ పాట (మరి ఇన్ని రొజులు నల్ల భాష అర్ధం చేసుకొన్న తర్వాత brown భాష ని ఆ మాత్రం పట్టుకొలేమా! :) )

-- ఒన్నొచ్చి టు పై వాలె, టు వచ్చి త్రి పై వాలె... -

of course, అది తెలుగే అని తెలిసిన తర్వాతకుడా నమ్మబుద్ది కాలెదు అది వేరే సంగతనుకొండి.

2 comments:

sharma said...

అవును మరి తమరిదంతా అదో టైపు వ్యవహారం కదా.అందరూ నంది అంటే తమరు పంది అంటారు.

Solarflare said...

భలే కనుక్కొన్నారు... వహ్వా వహ్యా.. మొత్తం చదివిన తర్వాత తెలిసిందా, లేక పూర్తిగా చదవకుండానే కనుక్కొనేసారా? ఈ సారికి మొత్తం చదివి అప్పుడు చెప్పండేఁ

Post a Comment

మీ అభిప్రాయాలు, వ్యాఖ్యలూ, అక్షింతలు